యోగి రాజ్యంలో దళితులకు రక్షణ  లేదు

ఖమ్మంలో కాంగ్రెస్​ కొవ్వొత్తుల ర్యాలీ

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం, వెలుగు: ఉత్తరప్రదేశ్​లో దళితులకు రక్షణలేదని, సీఎం యోగి ఆదిత్యనాథ్​ఆధ్వర్యంలో రాక్షస పాలన సాగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మంలోని గాంధీ విగ్రహం దగ్గర  సోమవారం సాయంత్రం కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. క్యాండిల్​ ర్యాలీ తీసి బాధితురాలికి నివాళి అర్పించారు. హథ్రాస్​లో దళిత యువతిని రేప్​ చేసి చిత్రహింసలు పెట్టిన నిందితులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై దాడి చేయడాన్ని ఖండించారు.  ఖమ్మం కార్పొరేషన్​లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్​ తిలక్​అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు జావెద్, నేతలు మిక్కిలినేని నరేంద్ర, కామేపల్లి జడ్పీటీసీ ప్రవీణ్ నాయక్​  పాల్గొన్నారు.

యోగి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలి

దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను కాపాడుతున్న యోగి అదిత్యనాథ్​ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఏమ్మార్పీఎస్‍ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ క్లాక్‍  సెంటర్​లో  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన  నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. యువతి మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వకుండా పోలీసులు అర్ధరాత్రి దొంగల్లాగా  ఖననం చేయడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి శంకర్, అడెపు నాగార్జున, శ్రీనివాస్, స్వామి, వెంకన్న, కందికంటి అంజయ్య, నగేష్, బొజ్జ చిన్న, పెరిక శ్రీను, జలందర్, మడుపు శ్రీను, కమలమ్మ, యాదమ్మ, సుమలత, ఎల్లమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.

For More News..

ప్రకృతి వనాలకు ఎస్సీల భూములా?

మెరిట్​ ఉన్నా జాబ్​లు ఇస్తలేరు

ఎమ్మెల్సీ క్యాండిడేట్​పై టీఆర్ఎస్​ సస్పెన్స్