మేం రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే హరీశ్ కు గిట్టడం లేదు : భట్టి

మేం రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే హరీశ్ కు గిట్టడం లేదు : భట్టి

తెలంగాణలో దశ,దిశ లేని పాలన నడుస్తోందన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. బీఆర్ఎస్ ను విమర్శించడం తప్ప బడ్జెట్ లో మరేమీ లేదన్నారు. 8 నెలల రాష్ట్ర పాలనలో సాధించిన విజయం ఏమిటో చెప్పాలన్నారు. బడ్జెట్ లో వాస్తవాలు విస్మరించారనన్నారు. బీఆర్ఎస్  టార్గెట్ గానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు.

 తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికికారణం తామేనని చెప్పారు హరీశ్ .  సభలో తమ గొంతును నొక్కేయొద్దన్న హరీశ్ రావు.. తాము మాట్లాడేటప్పుడు స్క్రీన్ పై చూపెట్టడం లేదన్నారు. ఎవరిపాలనలో విద్యుత్ బాగుందో ప్రజలను నేరుగా అడుగుదామన్నారు హరీవ్ రావు.  తలసరి విద్యుత్ వినియోగం  2,349 యూనిట్లకు పెరిగిందన్నారు హరీశ్ రావు. ఇపుడు రాష్ట్రంలో జనరేటర్ల పాలన జరుగుతోందన్నారు. ప్రభుత్వం పచ్చి అబద్ధాలుచెబుతోందని..గ్రామాల్లో విద్యుత్ పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.  100 రోజులు గడువు ముగిసింది..4వేల పెన్షన్  ఏమైందనిప్రశ్నించారు.

also read : సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత

 హరీశ్ వ్యాఖ్యలను మంత్రి భట్టి విక్రమార్క తప్పుబట్టారు.  హరీశ్ వాస్తవాలకు దూరంగా మాట్లాడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను పక్కదారి పట్టించొద్దని సూచించారు. గల్లీగల్లీకో బెల్టు షాపు పెడుతామని తాము చెప్పామా? అని ప్రశ్నించారు. 2014లో ఎక్సైజ్ ఆదాయం 10 వేల కోట్లు అయితే..బీఆర్ఎస్ హయాంలో  34 వేల కోట్లకు చేరిందన్నారు. ఆధారాలు లేని మాటలు మాట్లిడితే మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. తాము రాష్ట్రాన్ని బాగుచేస్తుంటే హరీశ్ కు గిట్టడం లేదు