జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ

జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ

హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు  ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ ప్రకటించారు.  హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో  8న మందు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రసాదం పంపిణీ పై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రసాదం తయారీ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిసింది. ఈ ప్రసాదం తింటే ఆస్తమా వ్యాధి తగ్గుతుందని ప్రజల నమ్ముతారు.

చేప ప్రసాదం పంపిణీ కి 170 యేళ్ల చరిత్ర ఉంది. అప్పటినుంచి బత్తిని వంశస్తులు ఉచితంగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ మందును ప్రతీ సంవత్సరం పంపిణీ చేసే బత్తిని సోదరులలో బత్తిని హరినాథ్ గౌడ్ ఒకడు. అతను 1944లో దూద్ బౌలి లో జన్మించాడు. అతని నానమ్మ చేప మందు తయారీ తన పిల్లలకు నేర్పింది. అతను 2023 ఆగస్టు 24న హైదరాబాదులో మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఈ చేపప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.


మొదట్లో పాతబస్తీలో పంపిణీ చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​కు మార్చారు. కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్​లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి..చేప పిల్లలను కొనుక్కుంటే సరిపోతుంది.