మాలలు ఎక్కువ లబ్ధి పొందినట్లు నిరూపిస్తే 30 లక్షలిస్తాం

మాలలు ఎక్కువ లబ్ధి పొందినట్లు నిరూపిస్తే 30 లక్షలిస్తాం
  • మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్
  • ఎంపిరికల్ ​డేటా ప్రకారం ప్రూవ్ చేయాలని సవాల్

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా సంక్షేమ పథకాల ద్వారా మాదిగల కంటే మాలలు ఎక్కువ లబ్ధి పొందినట్లు నిరూపిస్తే రూ.30 లక్షలు ఇస్తామని మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్​ ఇండియా అధ్యక్షుడు దిగంబర్​కాంబ్లే, సింగర్ రెంజర్ల రాజేశ్, రాజు వస్తాద్​ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలు, ఎస్సీ కార్పొరేషన్​, సాంస్కృతిక రథ సారథి, సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​స్కూళ్లు.. ఇలా అన్నింటిలో మాదిగల కంటే మాలలు లబ్ధి పొందినట్టు ఎంపిరికల్ డేటా ప్రకారం 15 రోజుల్లోగా నిరూనించినోళ్లకు తాము తలో రూపాయి వేసుకుని 30 లక్షలు బహుమతిగా ఇస్తామన్నారు. 

ఇటీవల బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలంగాణ విఠల్​ మాలలను సామాజిక స్మగ్లర్లంటూ కామెంట్ చేయడాన్ని వారు ఖండించారు. విఠల్​కు, పృథ్వీరాజ్​కు మాల, మాదిగల పంచాయితీల్లో ఏంపని అని ప్రశ్నించారు. వర్గీకరణ సాధన కోసం మాదిగలు శక్తిమేర ఏమైనా చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారని, దాని వెనుక చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఉన్నారనడం అవగాహనా లోపమని అన్నారు. తమతో ఉన్నది, తమను నడిపిస్తున్నది రాజ్యాంగ నిర్మాత అంబేద్కరేనని అన్నారు.

మంద కృష్ణ మాదిగతోపాటు ఇంకొంతమంది రాష్ట్రంలో కాంగ్రెస్​ను దించి, బీజేపీ పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాల సంఘాల జేఏసీ నేతలు గోపోజు రమేశ్​, దాసరి విశాల్, ఉమాకాంతరావు, మాల రవీందర్, చొక్కంపేట ఆంజనేయులు, దాసరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.