హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద 100 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతివ్వాలని ఏసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు వి.శిల్పారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని గురువారం విచారించిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి 100 మంది మహిళలతో బతుకమ్మ వేడుక నిర్వహించుకోవడానికి అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. ఇందులో డీజే. సౌండ్ సిస్టంలు వినియోగించరాదన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బతుకమ్మ సంబురాల పోస్టర్లను ఆవిష్కరించారు.