పార్కింగ్ వాహనాలను ఎత్తుకెళ్లి.. తక్కువ ధరకు సేల్

ఈ మధ్య సైబర్ నేరాలతో పాటు బైక్ చోరీలు పెరిగిపోతున్నాయి. బైక్ తో బయటకు వెళ్లే వారు జర జాగ్రత్త..ఎందుకంటే ఏమాత్రం ఆలస్యమయినా బైకులను ఎత్తుకెళుతున్నారు కేటుగాళ్లు. వేరే చోట తక్కువ ధరకు లేదా పార్ట్స్ మార్చి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. 

 లేటెస్ట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో బైకులు ఎత్తుకెళ్లి అమ్ముతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బీబీనగర్ (మ) కొండ మడుగు గ్రామానికి చెందిన కుతడి బాను చందర్ అనే యువకుడు పార్క్  చేసిన  వాహనాల చోరీ చేసి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు భువనగిరి డీసీపీ  రాజేష్ చంద్ర తెలిపారు. బాను చందర్ దగ్గర 26 బైకులను  స్వాధీనం చేసుకున్నారు. 

 అలాగే  భువనగిరి మండలం బస్వాపూర్ శివార్లలో మహిళ మెడలోంచి పుస్తెల తాడు దొంగిలించిన మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర  నాలుగు తులాల బంగారం పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు.

Also Read :ఫీజులు చెల్లించలేదని.. విద్యార్థులను బస్సుల్లో కూర్చోబెట్టారు