- లేకుంటే 10 లక్షల మందితో ‘గౌడ గర్జన’ చేపడతాం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల హెచ్చరిక
ఖైరతాబాద్, వెలుగు: ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న జూపల్లి కృష్ణారావును ఆ శాఖ నుంచి తప్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్డిమాండ్చేశారు. లేకుంటే కల్లు గీత వృత్తిని ఎక్సైజ్‌శాఖ నుంచి తొలగించి బీసీ శాఖలో కలపాలని కోరారు. ‘ఏడాది కాంగ్రెస్ పాలన– -కల్లు గీత వృత్తి’ అనే అంశంపై సోమవారం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌సమావేశం నిర్వహించారు. అనంతరం గౌడ సంఘాల నాయకుల సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కల్లు గీత వృత్తిని బీసీ శాఖలో కలపాలని లేదా జూపల్లి కృష్ణారావును ఎక్సైజ్‌శాఖ నుంచి తప్పించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే వారం రోజుల్లో 10 లక్షల మంది గౌడ్లతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామన్నారు. మంత్రి జూపల్లి గీతకార్మికులపై కేసులు పెట్టిస్తూ.. కళ్లు దుకాణాలను మూయిస్తున్నారని ఆరోపించారు.
గౌడ నేతలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న, మహాత్మ జ్యోతిరావుఫూలే వంటి నేతల విగ్రహాలు పెట్టేందుకు స్థలం, బడ్జెట్లేదంటున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో లేని తెలంగాణ తల్లి విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బాలరాజ్ గౌడ్, అయిల వెంకన్న గౌడ్, ఎంవీ రమణ, ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్తదితరులు పాల్గొన్నారు.