మంచిర్యాల, వెలుగు: రానున్న ఎన్నికల్లో మంచిర్యాల టికెట్‌ను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలని డిమాండ్‌చేస్తూ బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఆమ్ఆద్మీ పార్టీల నాయకులతో పాటు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్లు, బార్అసోసియేషన్, భవన నిర్మాణ సంఘం ప్రతినిధులు మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు.
ఎమ్మెల్యే ఆశావహ నాయకులు మంచిర్యాల మున్సిపల్వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, డాక్టర్లు పూజారి రమణ, బి.రఘునందన్, నీలి శ్రీనివాస్, ఉదారి చంద్రమోహన్‌గౌడ్, రాపోలు విష్ణువర్దన్, అడ్వకేట్ కర్రె లచ్చన్న, బియ్యాల సత్తయ్య, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక అధ్యక్షుడు రాజ్కిరణ్తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో 98 శాతం మంది బహుజనులు ఉన్నారని, వారిలో 60 శాతానికి పైగా బీసీలు ఉన్నారని తెలిపారు.
ALSO READ:అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం: దిడ్డి సుధాకర్
గత 70 ఏండ్లుగా అగ్రవర్ణాల వారే అధికారం అనుభవిస్తూ బీసీలను అగణదొక్కుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరూ టికెట్ఇవ్వకుంటే ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.