రూ.35 కోట్లతో రామగుండంలో బీసీ భవన్

రూ.35 కోట్లతో రామగుండంలో బీసీ భవన్

గోదావరిఖని, వెలుగు :  రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ విజ్ఞప్తి మేరకు రామగుండంలో త్వరలో రూ.35 కోట్లతో బీసీ సంక్షేమ భవన్​ నిర్మాణం చేపట్టబోతున్నట్టు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే మంత్రి సీతక్క, ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్​ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.