శైలో బంకర్ ను తొలగించాలి .. కిష్టారంలో రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన

శైలో బంకర్ ను తొలగించాలి .. కిష్టారంలో రోడ్డుపై  అర్థనగ్నంగా నిరసన

సత్తుపల్లి, వెలుగు :  ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలోని శైలో బంకర్ ను వెంటనే తొలగించాలని చేపట్టిన  నిరసన దీక్ష ఐదో రోజుకు చేరింది. శుక్రవారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీల వాసులు జాతీయ రహదారిపై అర్థ నగ్నంగా బైఠాయించి నిరసన తెలిపారు.

 శైలో బంకర్ కాలుష్యంతో తమ ప్రాంత ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, అధికారులు, పాలకులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తక్షణమే శైలో బంకర్ ను తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.  నిరసనలో భాగంగా యువకులు ‘ సేవ్ మీ’ అంటూ వంటిపై రాసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. వీరికి సీపీఎం నేతలు మద్దతు పలికారు.