
హైదరాబాద్, వెలుగు: బీసీ కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని, ఇందుకోసం చొరవ చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ కోరారు. సోమవారం ప్రజాభవన్‌లో భట్టిని నిరంజన్‌తో పాటు కమిషన్ మెంబర్లు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, జయప్రకాశ్ కలిశారు. ఈ సందర్బంగా జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్, ఇటీవల కొన్ని కులాల పేర్లు మార్చాలని వచ్చిన వినతులు, ఆ అంశంపై నోటిఫికేషన్ జారీ చేసి ఆయా వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకున్న విషయాన్ని భట్టికి వివరించారు.
పేర్ల మార్పుపై త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని నిరంజన్ వెల్లడించారు. కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పించి చట్ట సవరణలు చేసే అంశాన్ని కేబినెట్‌లో ప్రస్తావించాలని భట్టిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని నిరంజన్ తెలిపారు.