కుల గణనలో కుల సంఘాలు యాక్టివ్​ గా పనిచేయాలి : ​జి.నిరంజన్​

కుల గణనలో కుల సంఘాలు యాక్టివ్​ గా పనిచేయాలి : ​జి.నిరంజన్​

పద్మారావునగర్​, వెలుగు: కులగణన ప్రక్రియను కుల సంఘాలు సవాలుగా స్వీకరించి, యాక్టివ్​ గా పనిచేస్తూ, వందశాతం కులగణన సాధించాలని బీసీ కమిషన్​ చైర్మన్​ జి.నిరంజన్​ కోరారు. ఆయన మంగళవారం సికింద్రాబాద్​ కాంగ్రెస్​ ఇన్​చార్జి ఆదం సంతోష్​ కుమార్ తో కలసి సీతాఫల్మండి లో మీడియా తో మాట్లాడారు.  గతంలో జరిగిన ఎన్నికల్లో రూరల్​ లో 22 శాతం, అర్బన్​ లో 27 శాతం రిజర్వేషన్లను బీసీ లకు  ఖరారు చేస్తే వారు దాదాపు 44 శాతం సీట్లు గెలిచారన్నారు.

 అదే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తే దాదాపు 65 నుంచి 70 శాతం వరకు గెలిచే అవకాశం ఉండేదన్నారు. కులగణన అనేది కేవలం ఎన్నికల అంశం ఒక్కటే కాదని, ఆర్థిక, సామాజిక, స్థితిగతులకు కూడ ఈ కులగణన సర్వే ఎంతో ఉపకరిస్తుందన్నారు.  కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్​ అధికారులు, సిబ్బంది, నాయకులు ఆదం సృజన్​, డివిజన్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ అనిల్​ కుమార్​, షకీల్​, వహీద్​, చక్రధర్​, సూర్య ప్రకాశ్​, కల్పన, రాజేందర్​ పాల్గొన్నారు.