కులగణన రీ సర్వేలో వివరాలు ఇవ్వండి : గోపిశెట్టి నిరంజన్

కులగణన రీ సర్వేలో వివరాలు ఇవ్వండి : గోపిశెట్టి నిరంజన్

హైదరాబాద్, వెలుగు: కులగణన రీ సర్వేలో వివరాలు ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కోరారు. ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. శనివారం ఖైరతాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో మెంబర్ జయ ప్రకాశ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు.

 కమిషన్‌‌‌‌ పర్యటించిన ప్రాంతాల్లో సర్వే జరగని కుటుంబాల వివరాలను సేకరించి, అధికారులకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఆదివారం బీసీ కమిషన్‌‌‌‌ తరఫున ఇందిరా పార్కులో ఉదయం 6:30  నుంచి 10:00 గంటల వరకు వాకర్స్  తో కలిసి అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.