
కులగణనపై ప్రతపక్షాలది తప్పుడ ప్రచారం అని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు.ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కుల సంఘాలు కోరడంతో మరోసారి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే ఫార్మ్ ఆన్ లైన్ లో నింపి సబ్మిట్ చేయొచ్చన్నారు. కులగణనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సూచించారు. సర్వే లెక్కల ప్రకారం రేపటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.
బల్దియాలో కులగణన సరిగా లేదనే ఆరోపణలు వచ్చాయన్నారు నిరంజన్. జీహెచ్ఎంసీలోని అన్ని వార్డు ఆఫీసుల్లో కులగణన జరుగుతుందన్నారు. ఆన్ లైన్ లో కూడా ఫాం నింపి ఇచ్చే అవకాశం ఉందన్నారు. సర్వేలో ప్రజల అనుమానాలను అధికారులు క్లారిఫై చేయాలన్నారు. రీ సర్వేపై అధికారులు మరింత ప్రచారం చేయాలని ఆదేశించారు. సర్వేపై పబ్లిక్ లో బీసీ కమిషన్ అవగాహన కల్పిస్తుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ టోల్ ఫ్రీ పెడతామని చెప్పారు నిరంజన్. కేసీఆర్ టైమ్ లో 19 లక్షల కుటుంబాలకు సర్వే చేస్తే .. ఇప్పుడు 21 లక్షల ఫ్యామిలీస్ సర్వే చేశారు. ఈ సర్వేలో 1 కోటి15 లక్షల పైగా కులగణన చేశారు. లక్షా 3 వేల 300 ఎన్యుమరేటర్స్ సూపర్ విజర్స్ సర్వేలో పాల్గొన్నారు. 3 లక్షల 56 వేల 323 కుటుంబాలు సర్వే లో పాల్గొనలేదని సీఎం చెప్పారు. మళ్లీ సర్వే చేస్తే మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని నిరంజన్ తెలిపారు.