కులగణన సర్వేలో పాల్గొనండి .. గతంలో పాల్గొనని వాళ్లకు బీసీ కమిషన్ సూచన

కులగణన సర్వేలో పాల్గొనండి .. గతంలో పాల్గొనని వాళ్లకు బీసీ కమిషన్ సూచన

హైదరాబాద్, వెలుగు: గతంలో కులగణన సర్వేలో పాల్గొనని వాళ్లు.. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొని వివరాలు ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు సురేందర్, జయప్రకాశ్ సూచించారు. ఆదివారం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని కుమ్మరి బస్తీలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పర్యటించారు. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చారా? వివరాలు తీసుకున్నారా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 

200 కుటుంబాలతో చైర్మన్ మాట్లాడగా, అందులో 72 కుటుంబాలు గత సర్వేలో వివరాలు ఇవ్వలేదని తేలింది. దీంతో జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీసర్లకు చైర్మన్ ఫోన్ చేయగా.. ఆయా కుటుంబాల వివరాలు తీసుకుంటామని, డీటెయిల్స్ నమోదు చేసుకున్నారు. కాగా, మలక్ పేటలో మెంబర్ జయప్రకాశ్, గచ్చిబౌలిలో మరో మెంబర్ సురేందర్ పర్యటించారు.