మీ ప్రాంతంలో కులగణన చేశారా: కార్వాన్​ బస్తీల్లో పర్యటించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్​

మీ ప్రాంతంలో కులగణన చేశారా: కార్వాన్​ బస్తీల్లో పర్యటించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్​

మెహిదీపట్నం, వెలుగు: ‘మీ ప్రాంతంలో కులగణన చేశారా? అధికారులు వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారా? లేదా?’ అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్వాన్ పరిధిలోని ఆర్యసమాజ్, ఉప్పర బస్తీ, కాచి బస్తీ, టోలి మజీద్, బాంజ వాడీ ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి కులగణన సర్వేపై ఆరా తీశారు. కులగణనతో బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

ఆయన వెంట కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కూరాకుల కృష్ణ, టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ వినోద్ సింగ్, జీహెచ్ఎంసీ గ్రేటర్ కమిటీ సెక్రటరీ అబ్దుల్ హమీద్, జియగూడ డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గజ్రే కిషన్, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు వనజ, మహిళా ప్రెసిడెంట్ షకీలా పాల్గొన్నారు.