- మాజీ చైర్మన్లు, మెంబర్స్‌తో బీసీ కమిషన్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: కులగణనపై బీసీ కమి షన్ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ చైర్మన్లు, మెంబర్స్‌తో కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్, సభ్యులు బాలలక్ష్మి, సురేందర్, జయప్రకాశ్ శుక్రవారం సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు, కోర్టు కేసులు, తీర్పులను అడిగితెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసిన స్టడీ,కులగణనకు ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలలపై తయారు చేసిన రిపోర్టులను కమి షన్ మాజీ చైర్మన్లు వివరించారు.
బీసీ కమిషన్ ద్వారా కులగణన చేపట్టాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ అంశంపై చర్చించారు. మీటింగ్‌లో బీసీ కమిషన్ మాజీ చైర్మన్లు బీఎస్ రాములు, వకులాభరణం కృష్ణ మోహన్ రావు, మాజీ సభ్యులు జూలూరీ గౌరీశంకర్, ఉపేంద్ర శుభప్రద పటేల్, ఆంజనేయ గౌడ్, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.