
- అవగాహన కార్యక్రమాల్లో పాల్గొననున్న చైర్మన్, మెంబర్లు
హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేలో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్ పాల్గొననున్నారు. గతంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వాళ్లు ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఆదివారం చాంద్రాయణగుట్టలోని కుమ్మడివాడీ బస్తీకి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెళ్లి.. సర్వేలో పాల్గొనని వాళ్లకు అవగాహన కల్పించనున్నారు.
అలాగే మలక్ పేటలోని శాలివాహననగర్ లో కమిషన్ మెంబర్ రాపోలు జయప్రకాశ్, గచ్చిబౌలిలోని వెంకటేశ్వర కాలనీలో మరో మెంబర్ తిరుమలగిరి సురేందర్ అవగాహన కల్పించనున్నారు. కులగణన సర్వే ఆవశ్యకత, ఆ డేటాతో నిధుల కేటాయింపు వంటి అంశాలపై పబ్లిక్ కు అవేర్నెస్ కల్పించనున్నట్టు శనివారం ప్రకటనలో బీసీ కమిషన్ పేర్కొంది.