ఇయ్యాల (నవంబర్ 24) కలెక్టరేట్​లో బీసీ కమిషన్​ విచారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు : జిల్లాలోని బీసీల స్థితిగతులు తెలుసుకునేందుకు హైదరాబాద్ కలెక్టరేట్​లో బీసీ కమిషన్ శనివారం బహిరంగ విచారణ నిర్వహించనున్నది. ఇందుకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్, సెక్రటేరియల్, వ్యాలిడేషన్, నోటరీ డెస్క్ బృందాలతో జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకటాచారి శుక్రవారం సమావేశం నిర్వహించారు. 

శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ ఉంటుందని, దరఖాస్తుల స్వీకరించే టీమ్స్, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.