- కులసంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్
- ఈ నెల 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు
- తమ క్యాస్ట్ పేర్లను తిట్లకు ఉపయోగిస్తున్నారని ఆయా కులాల వారి ఆవేదన
హైదరాబాద్, వెలుగు: సమాజంలో చులకనభావంతో చూస్తూ, తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లను మార్చాలంటూ వచ్చిన అభ్యర్థనలను బీసీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నది. జిల్లాల్లో బీసీ కమిషన్చేపట్టిన పబ్లిక్ హియరింగ్‌కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలు ఉన్నాయి.
ఈ పేర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను కూడా ఆయా కులసంఘాల ప్రతినిధులు సూచించడంతో కులాల పేర్లను మారుస్తూ శనివారం బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చిన పేర్లపై ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం నుంచి ఈ నెల 18 వరకు ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్‌లో సంప్రదించాలని బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయ దేవి నోటిఫికేషన్లో పేర్కొన్నారు.