- వినతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం: బీసీ కమిషన్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: బీసీల్లో ఎనిమిది కులాల పేర్ల మార్పు, పర్యాయపదాలు జోడింపునకు సంబంధించి అభ్యంతరాల గడువు శనివారం ముగిసిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ అంశంపై సుమారు 500 వినతులు, అభ్యంతరాలు వచ్చాయని, వాటిని కమిటీ పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనం తరం పేర్ల మార్పుపై ప్రభుత్వానికి లేఖ రాస్తామ న్నారు.
జిల్లాల్లో బీసీ కమిషన్ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో తమ కులాల పేర్లను సమాజంలో న్యూనతా భావంతో చూస్తున్నారని, ఆయా పేర్లను మార్చాలని కమిషన్ కు పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. దీంతో 8 కులాల పేర్ల మార్పు, పర్యాయ పదాల యాడింగ్కు ఈ నెల 3న బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సలహాలు, సూచనలకు15 రోజులు గడువు ఇచ్చింది. ఈ గడువు శనివారంతో ముగిసింది.