ఉమ్మడి జిల్లాల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ హియరింగ్

  • 16న నల్గొండ, 17న ఖమ్మంలో హియరింగ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ ఈ నెల 16 నుంచి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుంది. ఈ నెల16న నల్గొండ, 17న ఖమ్మం, 18న మహబూబ్ నగర్ లో హియరింగ్ చేపట్టనున్నట్టు గురువారం కమిషన్ మెంబర్ సైదులు పత్రిక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 11, 12న హైదరాబాద్ లో కమిషన్ కార్యాలయంలో, 13న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ ను కమిషన్ పూర్తి చేసింది.

 వారం లోగా మిగిలిన 5 ఉమ్మడి జిల్లాల్లో హియరింగ్ ను పూర్తి చేసి ప్రభుత్వ శాఖలతో కమిషన్ సమావేశం కానుంది. ఈ నెల 30 లోగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం విధించిన గడువులోగా రిపోర్ట్ అందజేస్తామని కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు.