బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
  • ఈ నెల 22 నుంచి వచ్చే నెల12 వరకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 2025–-26 అకాడమిక్ ఇయర్​కు సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల12 వరకు  https://mjptbcwreis.telangana.gov.in  https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB/ వెబ్ సైట్ లలో అప్లై చేసుకోవాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన సూచించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తున్నట్టు సెక్రటరీ చెప్పారు. బీసీ గురుకులాల్లోని130 జూనియర్ కాలేజీల్లో బాలురకు11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు10,720 సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.