బీసీ జేఏసీ ఇన్‌‌చార్జుల నియామకం

బీసీ జేఏసీ ఇన్‌‌చార్జుల నియామకం

మేడిపల్లి, వెలుగు : బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌‌చార్జులను ఆదివారం ప్రకటించారు. బీసీ పొలిటికల్‌‌ జేఏసీ సమావేశాన్ని ఆదివారం ఉప్పల్‌‌లోని ఆఫీస్‌‌లో నిర్వహించారు. కో ఆర్డినేషన్‌‌ కమిటీ చైర్మన్‌‌ సుదగాని హరిశంకర్‌‌గౌడ్‌‌ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌లో ఎమ్మెల్సీ తీన్మార్‌‌ మల్లన్న హాజరై ఇన్‌‌చార్జులను ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాకు గటిక విజయ్‌‌కుమార్‌‌, హైదరాబాద్‌‌ ఇన్‌‌చార్జిగా తీన్మార్‌‌ మల్లన్నను ప్రకటించగా.. మెదక్‌‌కు బందారపు నర్సయ్యగౌడ్, నిజామాబాద్‌‌కు దేశగాని సాంబశివుడు, నల్గొండకు ఓదెలు యాదవ్, వరంగల్‌‌కు వట్టె జానయ్యయాదవ్‌‌ను నియమించారు.

అలాగే కరీంనగర్‌‌ ఇన్‌‌చార్జిగా సుదగాని హరిశంకర్‌‌గౌడ్‌‌, ఆదిలాబాద్‌‌కు బుస్సాపూర్‌‌ శంకర్, మహబూబ్‌‌నగర్‌‌కు సంగం సూర్యారావు, ఖమ్మంకు తమ్మదబోయిన అర్జున్‌‌ను ప్రకటించారు. బీసీ జేఏసీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, ఉద్యమ కార్యకర్తలు, కుల సంఘాలు, ఉద్యోగులు, బీసీ సంఘాలను ఏకం చేసి, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఇన్‌‌చార్జులు చెప్పారు.