- పోస్టర్లను ఆవిష్కరించిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్చేస్తూ ఈ నెల 10న ‘ఫీజుల పోరు’ పేరిట కలెక్టరేట్ల ముట్టడి తలపెట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఫీజు బకాయిలు విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నారని, ఆర్థిక ఆర్థికశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లేట్అవుతోందని ఆరోపించారు. గురువారం బషీర్ ప్రెస్ క్లబ్ లో కలెక్టరేట్ల ముట్టడి వాల్ పోస్టర్లను బీసీ నేతలతో కలిసి కృష్ణయ్య ఆవిష్కరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా విడుదల చేయలేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో చూపిస్తున్న శ్రద్ధ , విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయడంలో లేదని విమర్శించారు. సీఎం జోక్యం చేసుకొని బకాయిలను విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్, రామకృష్ణ, జిల్లపల్లి అంజి , నందగోపాల్, రాజేందర్, రాఘువులు, మల్లేశ్, చంద్రశేఖర్, ఉదయ్, బలరాం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.