- గాంధీభవన్ లో రాహుల్ చిత్రపటానికి పాలాభిషేకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణనను త్వరగా పూర్తి చేయాలని బీసీ నేతలు కోరారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల వాటా పెంచాలని ఈ సందర్భంగా వారు తీర్మానం చేశారు. రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ ప్రారంభానికి అంకురార్పణ చేసిన వ్యక్తి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని కొనియాడారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ కు చెందిన బీసీ నేతలు పాలాభిషేకం చేశారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు బుధవారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. దీనికి ఖనిజాభివృద్ధి చైర్మన్ ఈరవత్రి అనిల్ అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు సాయి, కాసుల బాల్ రాజ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభమైనందుకు ఇటు రాష్ట్రప్రభుత్వం, అటు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.