
- బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక డిమాండ్
- మంచిర్యాల జిల్లాలో భారీ బైక్‌ర్యాలీ
మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: రాజ్యాధికారమే ధ్యేయంగా బహుజనులు పోరాడాలని పలువురు బీసీ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని, ఓట్లు మావే... సీట్లు మావే అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ ప్రధాన పార్టీ అయినా బీసీని అభ్యర్థిగా ప్రకటిస్తే అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.
పార్టీలు టికెట్ఇవ్వకుంటే ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇండిపెండెంట్అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరించారు. దీనికి ముందుగా మంచిర్యాల, లక్సెట్టిపేటలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదిక అధ్యక్షుడు చంచు రాజ్‌కిరణ్, డాక్టర్లు బి.రఘునందన్, పి.రమణ, నీలకంఠేశ్వర్‌గౌడ్, లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్ముత్తె సత్తయ్య, మంచిర్యాల, నస్పూర్మున్సిపల్వైస్చైర్మన్లు గాజుల ముఖేశ్‌గౌడ్, దొమ్మటి అర్జున్, తోట శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, చుంచు గిరిధర్, సుధాకర్పాల్గొన్నారు.