నస్పూర్, వెలుగు: దేశంలో ఉన్న జనాభాకు అనుగుణంగా వారికి అన్ని అవకాశాలు ఉండాలని గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి లీడర్లు, బీసీ జేఏసీ లీడర్లు అన్నారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లా డుతూ.. గత 75 సంవత్సరాలుగా అగ్రవర్ణాల జెండాలు మోశామని, ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు అంటూ బీసీలు ఎదురు తిరగడం మొదలైందన్నారు.
మేము ఎంతో మాకు అన్ని అవకాశాలు కావాలనే డిమాండ్‌తో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గతంలో బీసీలు అర్థికంగా లేకపోవడంతో ఇబ్బంది పడ్డామని, నేడు తమ వాటా ఎంత అనేది తేలాలన్నారు. ఫిబ్రవరి 2న వరంగల్‌లో జరిగే బీసీ రాజకీయ యుద్దభేరికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం పోరాడినట్లే నేడు బీసీ హక్కుల కోసం పోరాడాలన్నారు. ఈ సందర్భంగా చల్ వరంగల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జక్కుల మల్లేశ్, సమ్ము రాజయ్య, ఒ.మనోహర్, జి.శ్రీనివాస్, గాదం ఎల్లయ్య, రాజన్న యాదవ్, జి.ఎల్లన్న, చంద్రకాంత్తదితరులు పాల్గొన్నారు.