- బీసీ రాజకీయ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్ బాగ్ , వెలుగు : సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ రాజకీయ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఏండ్ల తరబడిగా వారు చాలీ చాలని వేతనంతో జీవితాలు నెట్టుకొస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
అందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం... ఏనాడూ సమస్యలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ సలహదారుడు పి.బడేసాబ్, గాలిగల్ల సాయిబాబా, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి సరిత గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవనీత గౌడ్, కోశాధికారి శ్రీవాణి, రమ్య, ఫరీన్, గిరిజా భవాని, మధురవాణి, మోహన్, సరస్వతి, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.