- బాలల హక్కుల సంరక్షణ కమిషన్కు రాచల యుగందర్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: హీరో అల్లు అర్జున్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ కోరారు. సంధ్య థియేటర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కమిషన్ ఆఫీసులో ఘటనకు సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదు అందజేశారు.
అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ‘పుష్ప- 2’ ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం, చిత్ర యూనిట్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. హీరో అల్లు అర్జున్ దుష్ప్రవర్తనతో ఒక మహిళ చనిపోవడంతో పాటు ఆమె 8 ఏండ్ల కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.