బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

వనపర్తి టౌన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని బీసీ పొలిటికల్  జేఏసీ జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్  విజ్ఞప్తి చేశారు. గురువారం వనపర్తిలో మీడియాతో మాట్లాడుతూ బీసీలందరికీ సమాజంలో సముచితమైన స్థానం కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  బీసీల అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. బీసీ కుల గణనపై రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్  నాయకులు 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తోందని, ఆ లెక్కలు వెల్లడించకుండా గత సీఎం కేసీఆర్  బీసీలను రాజకీయంగా అణచివేశారని మండిపడ్డారు. వెంకటన్న గౌడ్, రాఘవేందర్ గౌడ్, రమేశ్ సాగర్, వసంత చారి, గంగాధర్ గౌడ్  పాల్గొన్నారు.