గడ్డం వంశీకే బీసీ పోరాట సమితి మద్దతు : మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

పెద్దపల్లి, వెలుగు: బీసీ పోరాట సమితి మద్దతు యువనేత గడ్డం వంశీకే ఉంటుందని తెలంగాణ బీసీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ గడ్డం వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్​ ఇవ్వాలని హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరుతున్నామన్నారు. కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి వంశీ కృషి చేస్తారన్నారు.

విశాక ట్రస్టు ద్వారా పెద్దపల్లి పార్లమెంటు పరిధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తుచేశారు. కాకా హయాంలోనే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. వంశీకృష్ణకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్య, లీడర్లు సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జగదీశ్​, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.