బాల్కొండ,వెలుగు: భీంగల్ లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నకిలీపత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కృషి హైస్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూళ్లపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ను కలిసి జిల్లా జనరల్ సెక్రటరీ ద్యాగ శేఖర్ ఫిర్యాదు చేశారు.
నకిలీపత్రాలతో స్కూళ్లు నడపుతున్నారని, ఫైర్ సేఫ్టీ లేదని ఎంఈవో కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా పొంతనలేని సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత ఎంఈవో, స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.