హైడ్రాను స్వాగతిస్తున్నం

హైడ్రాను స్వాగతిస్తున్నం
  • బీసీ విద్యార్థి సంఘం 

ముషీరాబాద్, వెలుగు : అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రవికుమార్ యాదవ్ ప్రకటించారు. విద్యానగర్ బీసీ భవన్​లో శనివారం భవిష్యత్తు తరాల మనుగడ అనే అంశంపై సమావేశం నిర్వహించారు.

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ హైదరాబాద్​ భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం హర్షించదగ్గ విషయమన్నారు.