బీసీ కులగణనపై అసెంబ్లీలో చట్టం చేయాలి

బీసీ కులగణనపై అసెంబ్లీలో చట్టం చేయాలి
  • సీఎం రేవంత్ రెడ్డికి జాజుల లేఖ

హైదరాబాద్, వెలుగు: కులగణన లెక్కలపై బీసీ సంఘాలు, మేధావులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే తమిళనాడు మాదిరిగా ప్రత్యేక చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటుకు పంపాలని ఆయన కోరారు. 

కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకు ఎవరితోను చర్చించలేదని, బీసీ సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులతో చర్చించకుండా అది ఎలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.