సమగ్ర కుటుంబ సర్వేపై బీజేపీ, బీఆర్ఎస్ ​ వైఖరేంటి?

  •     జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్న

బషీర్ బాగ్, వెలుగు : బీసీ కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరేంటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడారు. ప్రతి చిన్న అంశంపై ట్విట్టర్​లో స్పందించే కేటీఆర్ కులగణనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కులగణన అనేది కోట్లాది మంది బీసీల ఆకాంక్ష అని తెలిపారు. 

కులగణనతో సంక్షేమ పథకాలకు సంబంధం లేదని సీఎం చెప్పినప్పటికీ ప్రజల్లో అపోహ పెంచేలా బీజేపీ, బీఆర్ఎస్ నాయ కులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు బీసీలపై ప్రేమ ఉం టే, జాతీయ స్థాయిలో కుల గణన  చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కుల గణన ప్రక్రియ ఆగదని, ఈ లెక్కల ఆధారంగానే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు నిర్ణయిస్తారని జాజుల స్పష్టం చేశారు.