- బీసీ నేత ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: గ్యాడ్యుయేట్లు, టీచర్లఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశం జరిగింది.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా అన్ని పార్టీలు అన్యాయం చేశాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా సీట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. బీసీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారని, ఓట్లు వేసే యంత్రాలుగా చూడొద్దని చెప్పారు. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలను ఓడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘం అధ్యక్షుడు సి.రాజేందర్, భుపేష్ సాగర్, పలువురు గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.