బషీర్ బాగ్/ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తాము డిమాండ్‌చేసిన దానికంటే ఎక్కువ పెంచడం గొప్ప విషయన్నారు. బీఆర్‌ఎస్‌పాలనలో మెస్‌చార్జీలు పెంచలేదని, స్టూడెంట్ల సమస్యలను పట్టించుకున్న ఘనత రేవంత్‌రెడ్డికే దక్కు తుందన్నారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని, కాలేజీ స్టూడెంట్లకు పాకెట్ మనీ ఇవ్వాలని కోరారు.
శనివారం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు తెగించి కొట్లాడినప్పుడే హక్కులు దక్కుతాయన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు 5న బీసీల మేథోమదన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , జాతీయ కార్యదర్శి సుధాకర్, నాయకులు గుజ్జ సత్యం , వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఒకేసారి 40 శాతం మెస్ చార్జీలు పెంచడం శుభపరిణామం అని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం దోమలగూడ లో మిఠాయిలు పంచి పెట్టారు.