ఫీజు రీయింబర్స్​మెంట్ ఎత్తివేసే కుట్ర .. ఫీజుల పోరు సదస్సులో ఆర్.కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్​మెంట్ ఎత్తివేసే కుట్ర .. ఫీజుల పోరు సదస్సులో ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలు చెల్లించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఫీజుల పోరు సదస్సులో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్​మెంట్​స్కీంను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

ప్రభుత్వం ఏడాది పాలనలో బడ్జెట్ ను ఏఏ పథకాలపై ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని పెండింగ్ లో ఉన్న రూ.4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. గొరిగె మల్లేశ్ యాదవ్, గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, నందా గోపాల్, పగ్గెళ్ల సతీశ్, వంశీ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.