బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడం భేష్

 బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడం భేష్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం శుభ పరిణామమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల్లో వస్తున్న రాజకీయ చైతన్యాన్ని గుర్తించి అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాయని సోమవారం పత్రిక ప్రకటనలో ఆయన తెలిపారు. 

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీసీ వాదం తెలిసిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్, సీపీఐ బీసీలకు టికెట్లు ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.