
ట్యాంక్‌బండ్, వెలుగు: నెక్లెస్‌రోడ్‌లో సామా జిక సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పూలే జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు బీసీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లో పూలే విగ్రహ ఏర్పాటు స్థల పరిశీలన చేసిన అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్.. పూలే విగ్రహాన్ని పెట్టకుండా బీసీలను అవమానించిందని విమర్శించారు. ఈ విషయంపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నిసార్లు వినతి పత్రాలిచ్చినా పట్టించుకోలేదని.. పూలేకు కనీసం నివాళులర్పించలేదని ఫైర్ అయ్యారు.