సెప్టెంబర్ 29న బీసీసీఐ ఏజీఎమ్‌‌‌‌‌‌‌‌

బెంగళూరు : బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌‌‌‌‌‌‌‌) ఈ నెల 29న బెంగళూరులో జరగనుంది. బోర్డు మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అందరూ నగరంలో నే ఉండటంతో ఏజీఎమ్‌‌‌‌‌‌‌‌తో పాటు శివార్లలో కొత్తగా నిర్మించనున్న నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ) సెంటర్‌‌‌‌‌‌‌‌కు ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. అయితే జై షా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొత్త సెక్రటరీగా ఎవర్ని తీసుకోవాలన్న దానిపై ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చర్చించే అవకాశాలు కనిపించడం లేదు. 

డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జై షా ఐసీసీకి వెళ్లనుండటంతో బీసీసీఐ తరఫున ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లకు రోజర్‌‌‌‌‌‌‌‌ బిన్నీ హాజరుకానున్నారు. లేదంటే కొత్తగా వచ్చే సెక్రటరీ ఈ బాధ్యతలు చేపట్టొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో జనరల్‌‌‌‌‌‌‌‌ బాడీకి చెందిన ఇద్దరు ప్రతినిధులను చేర్చడం

క్రికెటర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్​ నుంచి ఒకర్ని తీసుకోవడంపై ఏజీఎమ్‌‌‌‌‌‌‌‌లో చర్చించనున్నారు. 2024–25 వార్షిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌, అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌, ఎథిక్స్‌‌‌‌‌‌‌‌ అఫీసర్‌‌‌‌‌‌‌‌ నియామకాలు, అంపైర్ల కమిటీ, స్టాండింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.