క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా పూర్తి స్థాయిలో భారత్ వన్డే వరల్డ్ కప్ కి ఆతిధ్యమిస్తుంది. దీంతో బీసీసీఐ గ్రాండ్ గా ఈ టోర్నీ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా స్టేడియాల నిర్మాణానికి భారీగా ఖర్చు పెట్టేసింది. ఇక తాజాగా స్టేడియంలోని ప్రేక్షకుల కోసం మినరల్ వాటర్ ఫ్రీగా అందిస్తూ గొప్ప నిర్ణయం తీసుకుంది.
గురువారం భారత్‌లో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ముందు, భారత క్రికెట్ అభిమానులందరికీ ఉచిత మినరల్ మరియు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అందజేస్తుందని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెక్రటరీ జయ్ షా ప్రకటించారు. "వన్డే ప్రపంచ కప్ సమరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేస్తున్నా. వరల్డ్ కప్ మ్యాచులు జరిగే ప్రతి స్టేడియంలో ఫ్రీగా మినరల్ వాటర్ అందిస్తాం. అభిమానులని మ్యాచులను చూసి ఎంజాయ్ చేయండి". అని ట్విట్టర్ వేదికగా జైషా ప్రకటించాడు.
కాగా.. అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ నేడు గ్రాండ్ గా మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా ప్రస్తుతం ఇంగ్లాండ్ 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్ (30) రూట్ (51) క్రీజ్ లో ఉన్నారు. మరి ఈ మ్యాచులో గెలిచి ఎవరు ఘనంగా వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారో చూడాలి.
- ALSO READ | Cricket World Cup 2023: సచిన్‌కి అరుదైన గౌరవం.. క్రికెట్ గాడ్ చేతుల మీదగా వరల్డ్ కప్ ట్రోఫీ