పాండ్యా. జడేజాకు ప్రమోషన్‌‌.. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించిన బీసీసీఐ

పాండ్యా. జడేజాకు ప్రమోషన్‌‌.. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించిన బీసీసీఐ

ముంబై:  టీమిండియా స్టార్‌‌ ఆల్​రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌‌ పాండ్యా, అక్షర్​ పటేల్​కు ప్రమోషన్‌‌ లభించింది. బీసీసీఐ సెంట్రల్‌‌ కాంట్రాక్టుల్లో జడేజా  గ్రేడ్‌‌–ఎ నుంచి ఏడాదికి ఏడు కోట్ల జీతం వచ్చే ‘ఎ ప్లస్​’లోకి ప్రమోషన్‌‌ దక్కించుకున్నాడు. ఈ మేరకు  2022–23 సీనియర్‌‌ మెన్స్‌‌ టీమ్‌‌ యాన్యువల్‌‌ ప్లేయర్ల రిటైనర్‌‌షిప్‌‌ కాంట్రాక్టులను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. పాండ్యా  (సి నుంచి), అక్షర్​ (బి నుంచి)  ఏడాదికి ఐదు కోట్లు లభించే ‘ఎ’ గ్రేడ్‌‌లో చోటు దక్కించుకున్నారు.  ఇందులో అశ్విన్,  షమీ, పంత్ కూడా  ఉన్నారు.  ఇక, ఇటీవలే టెస్టు టీమ్​లోకి వచ్చిన కేఎస్​ భరత్​కు  గ్రేడ్​ సి కాంట్రాక్ట్​ దక్కింది.  

సెంట్రల్‌‌ కాంట్రాక్టు వివరాలు

గ్రేడ్ ‘ఎ’ ప్లస్‌‌ (రూ.7 కోట్లు): - రోహిత్,  కోహ్లీ, బుమ్రా, జడేజా

గ్రేడ్ ఎ (రూ. 5 కోట్లు): పాండ్యా,  అశ్విన్,  షమీ, పంత్, అక్షర్

గ్రేడ్ బి(రూ. 3 కోట్లు) :- పుజారా, రాహుల్, శ్రేయస్ అయ్యర్,  సిరాజ్, సూర్యకుమార్, గిల్

గ్రేడ్ సి (రూ.1 కోటి): - ఉమేశ్‌‌ , ధవన్, శార్దూల్, ఇషాన్, దీపక్ హుడా, చహల్, కుల్దీప్ యాదవ్, సుందర్,  శాంసన్, అర్ష్‌‌ దీప్, కేఎస్‌‌ భరత్.