IND vs ZIM: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

IND vs ZIM: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

జూలై 6 నుంచి జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం(జూన్ 24) ప్రకటించింది.  మొత్తం యువ జట్టునే జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వనున్న నేపథ్యంతో భారత జట్టు పగ్గాలు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు.   

ఐపీఎల్ 2024 సీజన్‌లో అలరించిన యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీష్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండేలకు భారత సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. 8 ఏళ్ల తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. చివరి సారి ఈ ఇరు జట్ల మధ్య 2016లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. భారత్ 2-0తో గెలిచింది. 

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

భారత్ - జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20: జులై 6 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • రెండో టీ20: జులై 7 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • మూడో టీ20: జులై 10 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • నాలుగో టీ20: జులై 13 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • ఐదో టీ20: జులై 14 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)