టెస్ట్ ఛాంపియన్ షిప్ ముగిసిందో లేదో.. మరో షెడ్యూల్ వచ్చేసింది. టీమిండియా వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు 2 టెస్టులు, 3 వన్డేలతో పాటు 5 టీ 20 మ్యాచులు ఆడనుంది.
జూలై 12 నుంచి 24 వరకు టెస్ట్ సిరీస్ జరగనుండగా.. జూలై 27 నుంచి వన్డే సిరీస్ మొదలు కానుంది. ఆ తరువాత ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లోని చివరి రెండు టీ20లు యూఎస్‌లోని ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లను భారత అభిమానులు డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. మొబైల్‌లో చూడాలనుకునేవారు జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
ఇండియా vs వెస్టిండీస్ పూర్తి షెడ్యూల్
- జులై 12- జులై 16: తొలి టెస్టు (డొమినికా)
- జులై 20 - జులై 24 : రెండో టెస్టు (ట్రినిడాడ్)
- జులై 27: ఫస్ట్ వన్డే (బార్బోడస్)
- జులై 29: రెండో వన్డే (ట్రినిడాడ్)
- ఆగస్టు 1: మూడో వన్డే (ట్రినిడాడ్)
- ఆగస్టు 3: ఫస్ట్ టీ20 (ట్రినిడాడ్)
- ఆగస్టు 6: రెండో టీ20 (గయానా)
- ఆగస్టు 8: మూడో టీ20 (గయానా)
- ఆగస్టు 12 : నాలుగో టీ20 (ఫ్లోరిడా, యూఎస్)
- ఆగస్టు 13 : ఐదో టీ20 (ఫ్లోరిడా, యూఎస్)