Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్.. భారత ప్ర‌పంచ‌క‌ప్‌ జ‌ట్టు ప్ర‌క‌టన

Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్.. భారత ప్ర‌పంచ‌క‌ప్‌ జ‌ట్టు ప్ర‌క‌టన

అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కొరకు బీసీసీఐ మంగళవారం (ఆగస్టు 27) భారత జట్టును  ప్ర‌క‌టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. రిచా ఘోష్, యాస్తికా భాటియా వికెట్ కీపర్లుగా సెలక్ట్ చేశారు. భాటియా ఎంపిక ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుంది. 

గ్రూప్‌‌‌‌‌‌‌‌ –ఎలో ఉన్న ఇండియా అక్టోబర్  4న న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, 6న పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో పోటీ పడుతుంది. 17, 18వ తేదీల్లో సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌, 20న ఫైనల్‌‌‌‌‌‌‌‌ జరుగుతాయి. టోర్నీకి ముందు ఇండియా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29న వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్ 1న సౌతాఫ్రికాతో వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. 

10 జట్లు.. 18 రోజులు

పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ 1 ఉండగా..  ఆతిథ్య బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌ 2 గ్రూప్‌-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్‌-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 20న ఫైనల్‌ జరగనుంది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్)*, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి , రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సజన సజీవన్.

ట్రావెలింగ్ రిజర్వ్‌ ప్లేయర్స్ : ఉమా చెత్రీ (వారం), తనూజా కన్వెర్, సైమా ఠాకోర్