BAN vs IND: బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా.. వన్డే, టీ20 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ!

BAN vs IND: బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా.. వన్డే, టీ20 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ!

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడబోయే వన్డే, టీ20 సిరీస్ కు బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 15) షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు నెలలో ఈ పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్న మన క్రికెటర్లు.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ టూర్ కు వెళ్తుంది. 

దుబాయ్‌ వేదికగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. మొదట వన్డే సిరీస్ ఆగస్టు 17న ప్రారంభమవుతుంది. మీర్పూర్ వేదికగా ఆగస్ట్ 17, 20 న తొలి రెండు వన్డేలు జరుగుతాయి. చట్టోగ్రామ్ లో ఆగస్టు 23 న మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్ కు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంలో సందిగ్దత నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవాలని భావిస్తే యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

►ALSO READ | ICC Award: మార్చిలో మనోడే మొనగాడు: శ్రేయాస్ అయ్యర్‌కు ఐసీసీ అవార్డు

సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో టీమిండియా ఆగస్టు 26న బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. 2026 లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సిరీస్ కు భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్ట్ 26 న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఆగస్టు 29, ఆగస్టు 31 న వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. 

బంగ్లాదేశ్‌లో భారత్ వన్డే రికార్డు

చివరిసారిగా టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు.. 1-2 తేడాతో మన జట్టు సిరీస్ ను కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌తో ఓవరాల్ గా 25 వన్డేలు ఆడితే.. ఆరు ఓడిపోయి, 18 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

2025లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు షెడ్యూల్: 

ఆగస్టు 17.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. తొలి వన్డే.. మీర్పూర్ 

ఆగస్టు 20.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. రెండో వన్డే.. మీర్పూర్

ఆగస్టు 23.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. మూడో వన్డే.. చట్టోగ్రామ్

ఆగస్టు 26    భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. తొలి టీ20.. చట్టోగ్రామ్

ఆగస్టు 29    భారత్ వర్సెస్ బంగ్లాదేశ్..  2వ టీ20.. మీర్పూర్

ఆగస్టు 31    భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ 3వ టీ20.. మీర్పూర్