Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీకి మూడు రెట్లు

Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీకి మూడు రెట్లు

దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న టీమిండియాకు గుడ్ న్యూస్. భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల రూపాయల భారీ నగదును ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ గంభీర్ కు రూ. 3 కోట్ల రూపాయలు.. సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీలకు రూ. 50 లక్షల రూపాయలు అందుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియాకు $2.24 మిలియన్లు అంటే భారత కరెన్సీలో రూ.19.45 కోట్లు లభించాయి. మరోవైపు బీసీసీఐ అంతకు మూడు రెట్లు బహుమతిగా నజరానా రూపంలో ఇవ్వడం విశేషం. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు గాను బీసీసీఐ రూ. 120 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందించింది.     

ప్రైజ్  మనీ ప్రకటించిన తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మాట్లాడుతూ ఇలా అన్నాడు. "వరుసగా ఐసీసీ టైటిళ్లను గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైనది మరియు. ఈ బహుమతి ప్రపంచ వేదికపై టీమిండియా అంకితభావం, నైపుణ్యాన్ని గుర్తిస్తుంది. ఈ నగదు బహుమతి తెర వెనుక ప్రతి ఒక్కరూ చేసే కృషికి గుర్తింపు. ఐసీసీ అండర్ 19 మహిళల ప్రపంచ కప్ విజయం తర్వాత 2025లో ఇది మా రెండవ ఐసీసీ ట్రోఫీ. భారత క్రికెట్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ". అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ బోర్డు ప్రకటనలో తెలిపారు.

Also Read:-సారధిగా సంజు శాంసన్ ఔట్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన రాజస్థాన్‌ రాయల్స్

భారత్ కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ. అంతకముందు 2002, 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ ను గెలుచుకుంది. ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు.