అరుంధతి రెడ్డికి సెంట్రల్ కాంట్రాక్ట్‌‌‌‌

అరుంధతి రెడ్డికి సెంట్రల్ కాంట్రాక్ట్‌‌‌‌
  • గ్రేడ్‌‌‌‌–ఎలోనే హర్మన్‌‌‌‌, మంధాన, దీప్తి
  • విమెన్స్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితా విడుదల  

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో గ్రేడ్‌‌‌‌–ఎలో తమ చోటు నిలబెట్టుకున్నారు. హైదరాబాద్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ అరుంధతి రెడ్డి తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ మేరకు 16 మందితో విమెన్స్ టీమ్ కాంట్రాక్ట్స్ జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గ్రేడ్–బిలో పేసర్ రేణుకా ఠాకూర్, ఆల్‌‌‌‌రౌండర్ జెమీమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఓపెనర్ షెఫాలీ వర్మ తమ స్థానాలను కాపాడుకున్నారు.

యంగ్ ఆఫ్-స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్, - పేసర్లు టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, - ఆల్‌‌‌‌రౌండర్ అమన్‌‌‌‌జోత్ కౌర్, - వికెట్ కీపర్ ఉమా ఛెత్రికి తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. వీళ్లు గ్రేడ్‌‌‌‌–సికి ఎంపికయ్యారు. ఇందులో యస్తికా భాటియా, రాధా యాదవ్, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి కొనసాగనున్నారు.

మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాని, హర్లీన్ డియోల్‌కు  కాంట్రాక్టు దక్కలేదు.  - గ్రేడ్–ఎలోని క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ఏడాదికి రూ. 50 లక్షల శాలరీ అందుకుంటుంది. మ్యాచ్ ఫీజు అదనం. బి–గ్రేడ్ ప్లేయర్లకు రూ. 30 లక్షలు, సి–గ్రేడ్ ప్లేయర్లకు రూ. 10 లక్షలు లభిస్తాయి.  

సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా  

గ్రేడ్–ఎ: హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ;  గ్రేడ్–బి: రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్,షెఫాలీ వర్మ; - గ్రేడ్–సి: యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంకా పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌‌‌‌జోత్ కౌర్, ఉమా చేత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.